యాజమాన్యం ఏకపక్ష నిర్ణయంపై కార్మికులు ఆగ్రహం

హైదరాబాద్‌ : సింగరేణి యాజమాన్యంపై కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యాజమాన్యం ఏకపక్ష నిర్ణయంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వేతనంలో 50శాతం కోత విధించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సింగరేణి కార్మికులు డిమాండ్‌ చేశారు. అలాగే లే ఆఫ్‌ కాకుండా బొగ్గు గనుల్లో లాక్‌డౌన్‌ ప్రకటించాలని కోరారు. తమ డిమాండ్లు పరిష్కరించకుంటే ఈనెల 15 నుంచి సమ్మె చేపడతామని సింగరేణి కార్మికులు హెచ్చరించారు. ఈ మేరకు సింగరేణి సీఎండీకి గురువారం నోటీస్‌ ఇచ్చారు.